కరోనా వైరస్‌ని కట్టడి చేసిన మాస్కులు.. న్యూ స్టడీ

ముఖ మాస్కులు కరోనా వైరస్ ని చాలావరకు కట్టడి చేశాయని ఓ నూతన అధ్యయనంలో తేలింది. ఈ నిబంధనలను పాటించకుంటే.. ఇంకా లక్షలాది ఇన్ఫెక్షన్లు సోకి ఉండేవని ఈ స్టడీ పేర్కొంది. ఏప్రిల్ 6 నుంచి ..

కరోనా వైరస్‌ని కట్టడి చేసిన మాస్కులు.. న్యూ స్టడీ
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 12:18 PM

ముఖ మాస్కులు కరోనా వైరస్‌ని చాలావరకు కట్టడి చేశాయని ఓ నూతన అధ్యయనంలో తేలింది. ఈ నిబంధనలను పాటించకుంటే.. ఇంకా లక్షలాది ఇన్ఫెక్షన్లు సోకి ఉండేవని ఈ స్టడీ పేర్కొంది. ఏప్రిల్ 6 నుంచి  ఇటలీలో, అదే నెల 17 న న్యూయార్క్ సిటీలోను ప్రజలు మాస్కులు ధరించడం ప్రారంభించారు. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కుల ధారణ చాలా ముఖ్యమని.. భౌతిక దూరం పాటింపు, స్టే ఎట్ హోమ్ వంటి ఉత్తర్వులు కూడా వైరస్‌ని కట్టడి చేయగలిగాయని రీసెర్చర్లు వివరించారు. తమ అధ్యయన ఫలితాలను వీరు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.

ఏప్రిల్ 6, మే 9 మధ్య  ఇటలీలో ఇన్ఫెక్షన్లు 78 వేల వరకు ….. అలాగే న్యూయార్క్ సిటీలో ఏప్రిల్ 17-మే 9 మధ్య 66 వేల వరకు ఇన్ఫెక్షన్లు  తగ్గాయి అని వీరు పేర్కొన్నారు.  ముఖ్యంగా న్యూయార్క్‌లో మాస్కులను తప్పనిసరి చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల రేటు రోజుకు సుమారు 3 శాతం తగ్గినట్టు  తెలిపారు. కానీ దేశంలో ఇతర చోట్ల వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ నిబంధనల విధింపునకు ముందు.. క్వారంటైన్, ఐసోలేషన్, హ్యాండ్ శానిటైజేషన్ వంటి చర్యలు కూడా చేపట్టారని, కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్స్‌ని ఇవి పరిమితం మాత్రమే చేయగలిగాయని ఈ పరిశోధకులు స్పష్టం చేశారు.

Latest Articles
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..