AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: వర్చువల్ వరలక్ష్మీ వ్రతాలు..ఆన్‌లైన్‌లో హారతులు..

శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన సకల శుభాలు కలుగుతాయని అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.. అటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం..

కరోనా ఎఫెక్ట్: వర్చువల్ వరలక్ష్మీ వ్రతాలు..ఆన్‌లైన్‌లో హారతులు..
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2020 | 3:52 PM

Share

శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన సకల శుభాలు కలుగుతాయని అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.. అటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు అనగా పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతం ను మహిళలు ప్రతి ఇంటి లోను ఎంతో వైభవంగా ఎవరికీ వారు తమ శక్తి కొలది ఈ నోమును నోచుకున్న వారి ఇంట వారి సర్వ శుభాలు జరుగుతాయని పురాణాలు, పండితులు చెబుతున్న మాట.

శ్రావణ మాసం రెండవ శుక్రవారం, వరలక్ష్మీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రావణ-వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఉదయం 8 గంటలకు దేవస్ధానం ఆధ్వర్యంలో వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఆలయ సిబ్బంది, అధికారులు మాత్రమే కోవిడ్ నిబంధనల మేకు వ్రతాలు నిర్వహించారు.

అటు, చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు వేడుకగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా అమ్మవారికి పూజలు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం అయిదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్య అర్చన పూజలు చేశారు. అనంతరం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అలంకార శోభితురాలైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శాస్రోక్తంగా వరలక్ష్మీ పూజలు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా వ్రతం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పోస్టల్‌ ద్వారా వారి చిరునామాకు పంపనున్నారు. అమ్మవారి ఆలయ చరిత్రలో భక్తులు ఎవరూ లేకుండా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఇదే తొలిసారి.

Read More:

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది