42 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్‌!

యూపీలో కోవిద్-19 విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఘాజీపూర్‌లో కరోనా సోకిన 42 మంది జాడ తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో

42 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్‌!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 4:04 PM

యూపీలో కోవిద్-19 విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఘాజీపూర్‌లో కరోనా సోకిన 42 మంది జాడ తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో 42 మంది తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలను ఇచ్చారని అధికారులు తెలిపారు. శాంపిళ్ల సేకరణ సమయంలో వీరు ల్యాబ్‌లకు తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో, అడిషనల్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఎసిఎంఓ) డాక్టర్ కెకె వర్మ ‘కోవిద్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 42 మంది ఆచూకీ‌ తెలియడంలేదని’ పేర్కొన్నారు. “పరీక్ష సమయంలో కొంతమంది సరియైన మొబైల్ నంబర్, చిరునామాను ఇవ్వరు. వారికి పాజిటివ్ వస్తే, వారిని ట్రాక్ చేయడం మాకు కష్టమవుతుంది” అని అధికారులు తెలిపారు. ఘాజీపూర్‌ జిల్లాలో 505 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల 10 మంది చనిపోయారు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!

Latest Articles