కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.0 మొదలైపోయింది. ఈ క్రమంలోనే మరికొన్నింటికి కరోనా ఆంక్షలు సడలిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కోల్‌కతాకు ఆరు నగరాల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఆంక్షలను పొడిగించారు..

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్
Follow us

|

Updated on: Jul 31, 2020 | 2:08 PM

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.0 మొదలైపోయింది. ఈ క్రమంలోనే మరికొన్నింటికి కరోనా ఆంక్షలు సడలిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కోల్‌కతాకు ఆరు నగరాల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఆంక్షలను పొడిగించారు. కోవిడ్-19 హాట్‌స్పాట్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, నాగపూర్, అహ్మదాబాద్ నగరాల నుంచి కోల్‌కతా వచ్చే విమానాలపై ఆగస్టు 15వ తేదీ వరకు బ్యాన్ విధించారు. కోల్‌కతాలోని సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విషయాన్ని వెల్లడించింది. బెంగాల్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ వరకు వారానికి రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే, దేశంలోనే అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసుల వృద్ధి రేటు మహారాష్ట్రలో కొనసాగుతుండగా.. ఆ జాబితాలో మరికొన్ని రాష్ట్రాలు వచ్చి చేరాయి. జులై 15-28 మధ్య 14 రోజుల వ్యవధిలో 100 పరీక్షలకు మొత్తం ధ్రువీకరించిన కేసుల జాతీయ సగటు 10 నుంచి 11.2 శాతానికి పెరిగినప్పటికీ పలు రాష్ట్రాలు కోవిడ్‌కు కొత్త హాట్‌స్పాట్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసుల వృద్ధి రేటు మహారాష్ట్రలో 21 శాతం, కర్ణాటక 18 శాతం, బీహార్ 16 శాతం, పశ్చిమ్ బెంగాల్ 15 శాతం, ఆంధ్రప్రదేశ్ 14 శాతం, ఒడిశా 11 శాతంగా ఉంది. గతంలో హాట్‌స్పాట్‌లుగా ఉన్న ఢిల్లీ, గుజరాత్, తెలంగాణలు వరుసగా 11, 10, 7 స్థానాల్లో ఉన్నాయని తాజా అద్యయనం వెల్లడించింది.

Read More:

వరకట్న వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి