చరిత్రలో మొదటిసారిగా మైనస్‌లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
చరిత్రలోనే మొదటిసారిగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ప్రభావం చమురు ధరలపై భారీగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ముడి చమురుకు ఎలాంటి గిరాకీ లేకపోవడంతో..

చరిత్రలోనే మొదటిసారిగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ప్రభావం చమురు ధరలపై భారీగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ముడి చమురుకు ఎలాంటి గిరాకీ లేకపోవడంతో మే నెల కాంట్రాక్టకు సంబంధించి అమెరికా బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇటర్మీడిట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ధరలు సున్నా కంటే దిగువకు పడిపోయాయి. ఇలా జరగడం ఇదే తొలిసారి.
కాగా సరుకును ఎంతో కొంత నగదు చెల్లించి వదిలించుకునే స్థాయిలో బ్యారెట్ చమురు ధరల మైనస్-37.63 డాలర్లకు పడిపోయింది. ఏప్రిల్ కాంట్రాక్టులకు మంగళవారం తుది గడువు కావడం వల్ల మే నెల కాంట్రాక్టులపై కూడా దాని ప్రభావం పడి ధరలు క్షీణించాయి. అయితే ఇప్పుడు ఇదే అదునుగా భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 75 మిలియన్ బ్యారెళ్లను ప్రభుత్వం నిల్వ చేయనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు మైనస్‌లోకి వెళ్లినప్పటికీ.. దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం వీటి ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.67.82గా ఉన్నాయి.
Read More:
జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు
పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా



