భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లో దివ్య దర్శనం
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటికీ తాళం పడింది. అటు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల క్షేత్రం కూడా లాక్‌డౌన్‌తో మూసివేశారు. భక్తులను అనుమతించకుండా.. కేవలం ఆలయ సిబ్బంది సమక్షంలో నిత్య కైంకర్యాలు...

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటికీ తాళం పడింది. అటు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల క్షేత్రం కూడా లాక్‌డౌన్‌తో మూసివేశారు. భక్తులను అనుమతించకుండా.. కేవలం ఆలయ సిబ్బంది సమక్షంలో నిత్య కైంకర్యాలు మాత్రమే అందుకుంటున్నాడు తిరుమలేశుడు. అటు తెలంగాణలోని యాదాద్రి ఆలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆలయాన్ని సందర్శించే వీలు లేకపోవడంతో.. ఆల్‌లైన్ ద్వారా దర్శన భాగ్యం కల్పించేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో 20వ తేదీ సోమవారం నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుడి ఆర్జిత సేవలను ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రారంభించారు. పూర్తి వివరాలను ts.meeseva.telangana.gov.inలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కాగా కేవలం యాదాద్రి ఆలయమే కాకుండా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి, బాసర జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, హైదరాబాద్‌లోని పెద్దమ్మతల్లి, ధర్మపురి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానాల్లో జరిగే ఆర్జిత సేవలను ఈ విధానం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు.
Read More:
పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..
నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా
ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..
కరోనా సంక్షోభం: తెలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసిన కేంద్రం