AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనమే టాప్..మాస్క్‌లేని 70వేల మందిపై కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకు విస్తరిస్తున్న వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం నిబంధన తెచ్చినప్పటికీ.. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండానే యద్ధేచ్ఛగా తిరిగేస్తున్నారు.

మనమే టాప్..మాస్క్‌లేని 70వేల మందిపై కేసులు
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2020 | 5:52 PM

Share

దేశంలో స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజురోజు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనాకు సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ..మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలా మాస్క్ ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వేలాది మందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకు విస్తరిస్తున్న వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం నిబంధన తెచ్చినప్పటికీ.. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండానే యద్ధేచ్ఛగా తిరిగేస్తున్నారు. రోడ్లపైనా, మార్కెట్లు, చాలా చోట్ల అనేక మంది వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..మాస్క్ ధరించట్లేదు. అలా మాస్కులు ధరించని వారిపై పోలీసులు, సీసీ కెమెరాల సాయంతో పిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పటి వరకు 70 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. మరి మీరూ మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లి ఉంటే మీపైనా కేసు నమోదై ఉండవచ్చు. ఎందుకైనా మంచిది ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి..కరోనా పట్ల అవగాహనతో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us
ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..
ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..