భార్యతో భర్త ఈ మాట అన్నాడో అంతే సంగతులు.. చెప్పకూడని చిన్న మాట ఇదే!
Samatha
9 August 2026
భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్ల బంధంతో మొదలై, 100 సంవత్సరాలు కొనసాగుతుంది.
ఇక భార్య భర్తల మధ్య చిన్న మనస్పర్థలు గొడవలు రావడం సహజం. అయితే ఎన్ని గొడవలు జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదురు అయినా సరే..
భర్త భార్యతో ఈ ఒక్క మాట అనకూడదు అంటున్నారు నిపుణులు. భర్తలు తెలియకుండా అనే చిన్న చిన్న మాటలే వారిని చాలా బాధిస్తాయి.
మరీ ముఖ్యంగా ఒక మాట ఆ బంధం విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుందంట. కాగా, భర్త భార్యతో ఏ మాట అనకూడదో ఇప్పుడు మనం చూద్దాం.
వివాహం తర్వాత, భార్య, అత్తమామల మధ్య గొడవలు రావడం, వారి మధ్య మనస్పర్థలు రావడం చాలా కామన్.
అయితే కొన్ని సార్లు అత్త మామ, భార్యకు మధ్య చాలా వివాదాలు తలెత్తుతుంటాయి. అటువంటి సమయంలో భర్త కీలక పాత్ర పోషించాల్సి వస్తుంది.
అయితే ఈ సమయంలో భర్త నాకు తల్లిదండ్రులే మొదటి ప్రాధాన్యత, నువ్వు సర్దుకపోవడం అలవాటు చేసుకో , నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పకూడదంట.
ఇది ఏ భర్త తన భార్యతో అన్నా .. ఆ బంధం ఎక్కు కాలం కొనసాగదు, అని రిలేషన్ షిప్ కోచ్, నిపుణులు తెలియజేయడం జరిగింది. అందుకే ఎప్పుడూ భర్త భార్యతో ఈ మాట అనకూడదంట.