లవ్ టుడే బ్యూటీ ఇవానా క్యూట్ నెస్‌కు ఫిదా అవుతున్న కుర్రాళ్లు  

09 August   2026

Pic credit - Instagram

Rajeev 

తమిళ చిత్ర పరిశ్రమలో తన సహజమైన నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి ఇవానా.

ఆమె అసలు పేరు అలీనా షాజీ . 2000 ఫిబ్రవరి 25న కేరళలో జన్మించిన ఇవానా చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంది. 

ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇవానా కేవలం 12 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం మాస్టర్స్(2012) ద్వారా బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.

చిన్న వయసులోనే కెమెరా ముందు నటించే అనుభవం ఆమెకు తర్వాత హీరోయిన్‌గా ఎదగడానికి ఎంతో ఉపయోగపడింది.

‘నాచియార్’తో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆతరువాత లవ్ టుడే సినిమాతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ

చివరిగా సింగిల్ అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ కవ్విస్తుంది.