AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సినీ ఫక్కిలో యువతి కిడ్నాప్ కలకలం..! ప్రేమ పెళ్లి చేసుకున్న వారానికే..

ప్రేమించుకున్నారు.. పెద్దల నిర్ణయంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారు. కానీ వివాహం జరిగిన వారం రోజులకే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. అర్ధరాత్రి వరుడి ఇంటిపైకి వచ్చిన సుమారు 20 మంది.. దాడి చేసి, నవవధువును బలవంతంగా ఎత్తుకెళ్లారు.రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: సినీ ఫక్కిలో యువతి కిడ్నాప్ కలకలం..! ప్రేమ పెళ్లి చేసుకున్న వారానికే..
wedding
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 09, 2026 | 3:13 PM

Share

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సినీ ఫక్కిలో జరిగిన ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చిత్తాపూర్ గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులే దౌర్జన్యంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. చిత్తాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు, సంతోష్ నగర్ కు చెందిన కళ్యాణి (26) అనే యువతి వారం రోజుల క్రితం యాదగిరిగుట్ట వద్ద ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వారు అబ్బాయి ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 20 మందికి పైగా కలిసి రాత్రి వేళ అబ్బాయి ఇంటిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇంట్లోకి చొరబడి వధువు కళ్యాణిని రాత్రి సమయలో బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఎత్తుకెళుతున్నారన్న విషయం తెలుసుకున్న యువకుడు.. వారిని అడ్డగించదంతో కారును వదిలేసి పారిపోయారు. ఈ అకస్మాత్తు దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాప్‌కు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన వెనుక ప్రేమ వివాహమే ప్రధాన కారణమా? యువతిని ఎవరు తీసుకెళ్లారు? ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్న ఏడుగురు..
కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్న ఏడుగురు..
టెస్టుల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన టాప్-4 బౌలర్లు వీరే
టెస్టుల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన టాప్-4 బౌలర్లు వీరే
బాదం, జీడీ పప్పు కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే వెయ్య ఏనుగుల బలం
బాదం, జీడీ పప్పు కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే వెయ్య ఏనుగుల బలం
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం..బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీ బ్యూటీ
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం..బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీ బ్యూటీ
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
గిల్ కోరికకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ రానున్న ట్రై-సిరీస్‌లు
గిల్ కోరికకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ రానున్న ట్రై-సిరీస్‌లు
శని సంచారం.. వీరికి ధనానికి ధనం, బంగారానికి బంగారం
శని సంచారం.. వీరికి ధనానికి ధనం, బంగారానికి బంగారం
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు రెండో వారంలో వీరికి అప్పుల బాధలే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు రెండో వారంలో వీరికి అప్పుల బాధలే
చికిత్సకు లొంగని తీవ్రమైన ఆందోళనకు కొత్త చికిత్స.. భారతీయ వైద్య..
చికిత్సకు లొంగని తీవ్రమైన ఆందోళనకు కొత్త చికిత్స.. భారతీయ వైద్య..
ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?