AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేట‌ర్‌పై క‌రోనా పంజా..సీఎం కేసీఆర్‌కు కిష‌న్ రెడ్డి లేఖ‌

గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది...హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి..

గ్రేట‌ర్‌పై క‌రోనా పంజా..సీఎం కేసీఆర్‌కు కిష‌న్ రెడ్డి లేఖ‌
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2020 | 8:22 PM

Share

గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ ఎవరి ద్వారా వైర‌స్‌ వ్యాప్తి చెందుతుందో అన్న భయం అందరిలో నెలకొంది. అలాగే కాంటాక్టు లను గుర్తించడం కూడా కష్టంగా మారింది. దీంతో గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నవెూదవుతూనే ఉన్నాయి. చివరకు జిహెచ్‌ఎంసి, సచివాలయ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగుల్లో సైతం భయం నెలకొంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని కిషన్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. ప్రజల్లో అభద్రతాభావం, భయం పెరుగుతుందని వెల్ల‌డించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భ‌యాల‌ను తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తూ, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు రాష్ట్ర‌ప్ర‌భుత్వం అమ‌లు ప‌ర్చాల‌ని కిష‌న్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు.

Follow Us
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌