కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం…

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు […]

కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం...
Follow us

|

Updated on: May 06, 2020 | 7:58 AM

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌ను విధించింది. దీని కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయారు. కేంద్రం పలు సడలింపులు ఇచ్చినా కూడా రవాణా సేవలు, వ్యాపారాలు అధికంగా మూతపడటంతో దేశంలో ఉన్న నిరుద్యోగ సంక్షోభం మరింతగా విషమించిందని సీఎంఐఈ నివేదిక తెలిపింది. రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే ఈ రేటు ఎక్కువగా ఉందని తేలింది.

ఇక లాక్ డౌన్ మొదలైన మార్చి 24- 31 మధ్య దేశంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23.8శాతానికి పెరిగిందని సీఎంఐఈ వివరించింది. ఇప్పటికే దాదాపుగా 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారని నివేదిక అంచనా వేస్తోంది. సుమారుగా 1.6 బిలియన్ల మంది కార్మికులు – అంటే ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు సగం మంది – వారి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది, అంతేకాకుండా 436 మిలియన్లకు పైగా సంస్థలు కూడా తీవ్రమైన నష్టాలను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని ఐఎల్ఓ పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభం పేదలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది.

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ