Corona: కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా కలకలం.. ఇద్దరు విద్యార్థినులకు పాజిటివ్..
Kasturba School karakagudem: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. వైరస్ సోకుతోంది. దీంతో ప్రజలు..
Kasturba School karakagudem: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. వైరస్ సోకుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ తరుణంలోనే పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకల రేపుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్‌గా నమోదయిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ విద్యార్థినులను ఇంటికి పంపించారు.
తాజాగా ఇద్దరు బాలికలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పాఠశాలలో ఉన్న మిగిలిన విద్యార్థినులు భయంతో వణికిపోతున్నారు. పాఠశాలలో పాజిటివ్ కేసులు గుర్తించినప్పటికీ.. శానిటైజేషన్ విషయంలో స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాలికలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు. ఇద్దరు బాలికలకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణవడంతో బాలికల తల్లీదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: