అప్పటి వరకూ అంతే.. శ్రీవారి దర్శనంపై టీటీడీ ప్రకటన

| Edited By:

Mar 31, 2020 | 1:36 PM

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ మార్చి 31వ తేదీ వరకూ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో.. ముఖ్యంగా ఏపీలోనూ కరోనా పాజిటివ్ చేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో..

అప్పటి వరకూ అంతే.. శ్రీవారి దర్శనంపై టీటీడీ ప్రకటన
Follow us on

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ మార్చి 31వ తేదీ వరకూ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో.. ముఖ్యంగా ఏపీలోనూ కరోనా పాజిటివ్ చేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ఏప్రిల్ 14వ వరకూ కూడా శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంతేకాకుండా తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లను కూడా మూసివేశామని తెలిపింది. తిరుమల ఆలయాన్ని మూసివేయడం చరిత్రలో ఇది రెండోసారి. కాగా భక్తులకు దర్శనాలను నిలిపివేసినప్పటికీ స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు టీటీడీ అధికారులు. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

అయితే తిరుమలలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో అనాదలు, బిచ్చగాళ్లు, నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని ఆదుకునేందుకు టీటీడీ ముందుకొచ్చింది. రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను తయారు చేసి ఉచితంగా పంచిపెడుతున్నారు. పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్ పొట్లాలను పేదలకు పంపిణీ చేస్తున్నారు. రోజుకు 50 వార్డుల్లో 50 వాహనాల ద్వారా నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Read More also this:

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!