ఆ రైతులకు రైతుబంధు కట్ చేస్తాంః కేసీఆర్
ఇవాళ వ్యవసాయంపై విస్తృత సమావేశం నిర్వహించిన సీఎం కేసిఆర్.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు పండించాలని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, అలాగే 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కందులు వేయాలని సీఎం కేసిఆర్ చెప్పారు. రైతులు మొక్కజొన్న పంట వేయవద్దని విజ్ఞప్తి చేసిన సీఎం.. దాని స్థానంలో కందులు పండించాలని కోరారు. […]

ఇవాళ వ్యవసాయంపై విస్తృత సమావేశం నిర్వహించిన సీఎం కేసిఆర్.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు పండించాలని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, అలాగే 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కందులు వేయాలని సీఎం కేసిఆర్ చెప్పారు. రైతులు మొక్కజొన్న పంట వేయవద్దని విజ్ఞప్తి చేసిన సీఎం.. దాని స్థానంలో కందులు పండించాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలను రైతులతో వేయించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే రకాలు వేసిన రైతులకు రైతు బంధు పధకం కట్ చేస్తామని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.
Read More:
జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..




