వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ సాధ్యమేనా ?

ఈ కరోనా కాలంలో పార్లమెంటును నిర్వహించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. కరోనా వైరస్ కారణంగా గత మార్చి 23 న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం అర్ధాంతరంగా ముగించింది. రెండు సమావేశాల మధ్య ఆరు నెలల విరామం..

వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ సాధ్యమేనా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 1:16 PM

ఈ కరోనా కాలంలో పార్లమెంటును నిర్వహించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. కరోనా వైరస్ కారణంగా గత మార్చి 23 న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం అర్ధాంతరంగా ముగించింది. రెండు సమావేశాల మధ్య ఆరు నెలల విరామం ఉండాలన్నది నియమం. అంటే తదుపరి సమావేశాలు సెప్టెంబరు 23 న జరగాల్సి ఉన్నాయి. కానీ జులై చివరి వారంలో వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కరోనా వైరస్ పరిస్థితితో బాటు గాల్వన్ లోయలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణ, ఆర్ధిక మందగమనం వంటి అనేక సవాళ్లపై ప్రభుత్వాన్ని నిలదీయగోరుతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఢిల్లీకి రాలేమని అనేకమంది ఎంపీలు అప్పుడే తమ అశక్తత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్చ్యువల్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 542 మంది లోక్ సభ సభ్యులను, 242 మంది రాజ్యసభ సభ్యులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘కలిపేందుకు’ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఏర్పాట్లు చేయవలసి ఉంది. సగం మంది ఎంపీలు విజ్ఞాన్ భవన్ లో , మరో సగం మంది లోక్ సభ చాంబర్ లో.. ఇలా వేర్వేరుగా కూర్చోవలసి ఉంటుంది. అసలు కోరం అన్నదే సమస్య.. కనీసం పదింట ఒకవంతు మంది సభ్యులు లాగ్ ఇన్ కాగలుగుతారా.. అలాగే చాలా మంది టెక్ సేవీలు కూడా కాదు. ఈ పరిస్థితుల్లో వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలను ఎలా నిర్వహించాలన్నది సర్కార్ కి సమస్యగా మారింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో వర్చ్యువల్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరి.. ఇప్పుడు ఈ కరోనా కాలంలో భారత ప్రభుత్వం ఎలా ఈ సమావెశాలను నిర్వహిస్తుందో వేచి చూడాల్సిందే.