AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో మేనేజింగ్ డైరెక్టర్ మృతి.. చెన్నైలో హాస్పిటల్ మూసివేత..

తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ మరింత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్‌తో చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ మూసివేయాల్సి..

కరోనాతో మేనేజింగ్ డైరెక్టర్ మృతి.. చెన్నైలో హాస్పిటల్ మూసివేత..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 05, 2020 | 11:44 AM

Share

తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ మరింత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్‌తో చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ మూసివేయాల్సి వచ్చింది. ఆ ఆసుపత్రిలో ఏకంగా 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తాజాగా ఈ కరోనాతో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి చెందారు. దీంతో హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేసింది. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్‌లను ఇతర హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు సిబ్బంది. అలాగే హాస్పిటల్‌లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్‌కు వెళుతున్న వారిలో ఆందోళన నెలకొంది.

కాగా తమిళనాడు రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 1,07,001 కేసులు నమోదవ్వగా, 1450 మంది మరణించారు. ఇక 44,959 యాక్టీవ్‌ కేసులు ఉండగా, 60,592 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అలాగే దేశంలో 6,73,165 క‌రోనా కేసుల సంఖ్య నమోదవ్వగా.. క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 19,268కు చేరింది. ఇక ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,44,814 ఉండగా, వ్యాధి నుంచి కోలుకున్న‌వారు 4,09,082 మంది.

Read More: 

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..

Follow Us
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!