తెలంగాణలో కొత్తగా 1,524 కేసులు..1,161 మంది డిశ్చార్జ్..

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 వేల మార్క్ దాటి.. నలభై వేలకు చేరువయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా..

తెలంగాణలో కొత్తగా 1,524 కేసులు..1,161 మంది డిశ్చార్జ్..
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 10:38 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 వేల మార్క్ దాటి.. నలభై వేలకు చేరువయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఇక మంగళవారం నాడు కరోనా నుంచి కోలుకుని 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 24,840 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే కరోనా బారినపడి మంగళవారం నాడు 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 375 మంది మరణించారు.

కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 240 కేసులు, మేడ్చల్ జిల్లాలో 97 కేసులు సంగారెడ్డిలో 61కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో 8, కామారెడ్డి 19, వరంగల్ అర్బన్‌ 30, వరంగల్ రూరల్‌ 2, నిర్మల్ 3, కరీంనగర్ 29, జగిత్యాల 2, మెదక్ 24, మహబూబ్ నగర్ 7, మంచిర్యాల 12, భద్రాద్రి కొత్తగూడెం 8, జయశంకర్ భూపాల్లి 12, నల్గొండ 38, సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 7, ఆసీఫాబాద్ 5, వికారాబాద్ 21, నాగర్ కర్నూల్ 1, జనగాం 4, నిజామాబాద్ 17, ములుగు 6, వనపర్తి 5, సిద్దిపేట 4, సూర్యాపేట 15, గద్వాల జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?