వచ్చే రెండు నెలల్లో మరింతగా కోవిడ్ విజృంభణః ఈటెల రాజేందర్
వచ్చే రెండు నెలల్లో కోవిడ్ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశాలున్నందున.. వైద్యారోగ్య శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. అలాగే సీజనల్ వ్యాధులకు తోడు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ అయ్యే...
వచ్చే రెండు నెలల్లో కోవిడ్ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశాలున్నందున.. వైద్యారోగ్య శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. అలాగే సీజనల్ వ్యాధులకు తోడు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశావర్కర్ నుంచి కలెక్టర్ వరకూ అంతా రాత్రింబవళ్లూ పని చేసి ప్రజల్లో ధైర్యం నింపేందుకు కృషి చేయాలని చెప్పారు. అలాగే వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేసే నిర్ణయాధికారం జిల్లా మంత్రులు, కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు మంత్రి ఈటెల వెల్లడించారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడదల చేశారు మంత్రి.
ఇక కరోనా వైరస్‌కు మనిషిని చంపేశక్తి లేదని అన్నారు. అప్రమత్తంగా లేకుంటానే ప్రాణ హాని ఉంటుందన్నారు. కోవిడ్ నియంత్రణకు ఎంతైనా ఖర్చు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. ఇక ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, మమత ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు మంత్రి ఈటెల రాజేందర్.
Read More:
‘దావూద్ ఇబ్రహీం’ బయోపిక్‌ను తీయనున్న యాత్ర డైరెక్టర్..
ఆగష్టు 1 నుంచి మారే న్యూ రూల్స్ ఇవే..
‘సచిన్ కూతురు సారా’, ‘క్రికెటర్ శుభ్ మాన్ గిల్’ మధ్య ఏం జరుగుతోంది?
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..