Breaking: తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. రాష్ట్రంలో అనుమతించినవి ఇవే..

తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ నెల 29 వరకూ విధించిన లాక్ డౌన్ ను కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాలన్నీ గ్రీన్ జోన్లుగా మారాయని సీఎం స్పష్టం చేశారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. అటు కంటైన్మెంట్ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:13 pm, Mon, 18 May 20
Breaking: తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. రాష్ట్రంలో అనుమతించినవి ఇవే..

తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ నెల 29 వరకూ విధించిన లాక్ డౌన్ ను కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాలన్నీ గ్రీన్ జోన్లుగా మారాయని సీఎం స్పష్టం చేశారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు.

అటు కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో షాపులు ఓపెన్ చేసుకోవచ్చునని ప్రకటించారు. గతంలో మాదిరిగానే కర్ఫ్యూ రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఇక క్యాబ్స్, ఆటోలకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. అటోలలో డ్రైవర్ సహా ఇద్దరికి అనుమతి ఉండగా.. ట్యాక్సీ, కార్లలో డ్రైవర్ సహా ముగ్గురికి అనుమతి ఉంది. అటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి మొదలు కానున్నాయని.. సిటీ బస్సులకు మాత్రం అనుమతి లేదన్నారు.

ఇక మెట్రో సర్వీసులు కూడా మూసి ఉంటాయన్నారు. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ బస్సులకు కూడా అనుమతి లేదన్నారు. కంటైన్మెంట్ ఏరియాలు తప్పితే.. మిగతా  జోన్లలో సెలూన్లు, బార్బర్ షాపులు తెరుచుకోవచ్చన్నారు. అటు ఈ కామర్స్ సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీకి కూడా సీఎం అనుమతి ఇవ్వగా.. థియేటర్లు, జిమ్స్.. ఇతరత్రా జన సాంద్రత కలిగిన ప్రదేశాలన్నీ అన్ని కూడా మూసి ఉంటాయన్నారు. అటు మతపరమైన మందిరాలు ఈ నెల 31 వరకు మూసి ఉంటాయి. కాగా, కరోనా నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..