రాష్ట్ర పోలీసులపై తెలంగాణ హైకోర్టులో పిల్.. విచారణ నేడు..

రాష్ట్ర పోలీసులపై తెలంగాణ హైకోర్టులో పిల్.. విచారణ నేడు..

లాక్‌డౌన్ సంద‌ర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని....

Jyothi Gadda

|

Apr 08, 2020 | 7:15 AM

రాష్ట్ర పోలీసులపై తెలంగాణ హైకోర్టులో పిల్.. విచారణ నేడు.. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. అన్ని రాష్ట్రాల్లోనూ ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. అయితే, లాక్‌డౌన్ సంద‌ర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.

కొద్ది రోజుల క్రితం వనపర్తిలో ఓ తండ్రీ కొడుకు బైక్‌పై వెళ్తుండగా పోలీసులు దాడి చేసిన ఘటనను వివ‌రిస్తూ ఓ న్యాయ‌వాది హైకోర్టుకు లేఖ రాశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఈ మేర‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆ న్యాయవాది లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉమేష్ చంద్ర కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టారంటూ లేఖ‌లో ఆరోపించారు. జ్యూడిషియల్ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టే హక్కు పోలీసులకు ఏ విధంగా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు. న్యాయ‌వాది రాసిన లేఖ‌ను పిల్‌గా స్వీక‌రించిన హైకోర్టు..దానిపై నేడు విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu