ఆగ‌ష్టు 15 వేడుక‌లపై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు

న్యాయ స్థానాల్లో ఆగ‌ష్టు 15 వేడుక‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీలు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు కూడా..

ఆగ‌ష్టు 15 వేడుక‌లపై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 8:04 PM

న్యాయ స్థానాల్లో ఆగ‌ష్టు 15 వేడుక‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీలు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. రోజు రోజుకీ వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. దీంతో స్వాతంత్య్ర వేడుక‌ల్లో పాల్గొనే వారికి 50 మందికి మించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే 20 నిమిషాల్లో వేడుక‌ను పూర్తి చేయాల‌ని వెల్ల‌డించింది. సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని హైకోర్టు పేర్కొంది. న్యాయ స్థానాల్లో నిర్వ‌హించే ఆగ‌ష్టు 15 వేడుక‌ల్లో ఖ‌చ్చితంగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజ్ రాసుకోవాల‌ని ఇత‌ర కోవిడ్ నిబంధ‌న‌లను ఖ‌చ్చితంగా పాటించాల‌ని సూచించింది టీఎస్ హైకోర్టు.

కాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో  క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగానే కొన‌సాగుతోంది. వైద్య‌, ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం ఆదివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెలంగాణలో 1256 మందికి కొత్తగా కరోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో..త‌క్కువ సంఖ్య‌లో టెస్టులు చెయ్య‌డం వ‌ల్ల‌..పాజిటివ్ కేసుల సంఖ్య కూడా త‌క్కువ‌గా న‌మోదైంది. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 11,609 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1700 శాంపిళ్ల ఫలితం రావాల్సి ఉంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,24,840 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా.. 80,751 మందికి పాజిటివ్ అని తేలింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More: 

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..