తెలంగాణ కరోనా బులిటెన్: మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1286 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరింది. ఇక నిన్న 12 మంది కరోనా బారిన పడి మరణించగా....
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1286 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరింది. ఇక నిన్న 12 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 563కి చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1066 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 49,675కు చేరింది. అలాగే ప్రస్తుతం తెలంగాణలో 18,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 13,787 టెస్టులు చేయగా, ఇప్పటివరకూ 5,01,025 మందికి కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు నమోదు చేసిందని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది.