తమిళనాడు కస్టోడియల్ డెత్స్.. జైలుకు తరలిన పోలీసులు
తమిళనాడు ట్యుటికోరన్ కస్టోడియల్ డెత్స్ కేసులో ఇద్దరు వ్యక్తులతో సహా ముగ్గురు పోలీసులను ట్యుటికోరన్ జైలు నుంచి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. ట్యుటికోరన్ లో తండ్రీ కొడుకులు..
తమిళనాడు ట్యుటికోరన్ కస్టోడియల్ డెత్స్ కేసులో ఇద్దరు వ్యక్తులతో సహా ముగ్గురు పోలీసులను ట్యుటికోరన్ జైలు నుంచి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. ట్యుటికోరన్ లో తండ్రీ కొడుకులు.. జయరాజ్, బెనిక్స్ లను పోలీసులు టార్చర్ పెట్టడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులో పెను దుమారం రేపింది. ఈ కేసులో శ్రీధర్, బాలకృష్ణన్, మురుగన్ అనే ముగ్గురు పోలీసులను, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల తూత్తుకుడి జిల్లా కోర్టు వీరికి 15 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. సీబీ సీఐడీ అధికారులు కూడా ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. తండ్రీ కొడుకుల మర్డర్ ని సినీ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ సైతం ఖండించి.. మృతుల కుటుంబాలను పరామర్శించారు.