AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌ (58)కి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇక ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు...

మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 05, 2020 | 5:36 PM

Share

తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ మరింత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ముఖ్యంగా పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, నటులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌కి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకూ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్‌ (58)కి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇక ఎమ్మెల్యే అమ్మాన్ కే అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి మధురైలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు అన్నాడీఎంకే ఎమ్మెల్యే. అక్కడి నుంచి వచ్చిన తరువాత నుంచి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకి కోవిడ్ టెస్టులు చేయగా.. కరోనా ఉన్నట్లు నిర్థారణ అయింది.

కాగా తమిళనాడు రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 1,07,001 కేసులు నమోదవ్వగా, 1450 మంది మరణించారు. ఇక 44,959 యాక్టీవ్‌ కేసులు ఉండగా, 60,592 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

బ్రేకింగ్: నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..

Follow Us
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ
అత్యాశ, స్వార్ధం చివరికి ఒంటరిని చేస్తుంది.. అడవిలో భారీ వర్షం కథ
సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా..
సొరకాయ అంటే ఇష్టంలేదా? ఇలా దోశలు వేసి చూడండి.. పిల్లలు కూడా..
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆగస్టు 8 రాశిఫలాలు: వారికి అదృష్టం, ఉద్యోగ పదోన్నతి..
ఆగస్టు 8 రాశిఫలాలు: వారికి అదృష్టం, ఉద్యోగ పదోన్నతి..
సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్య
సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్య