బోర్డింగ్ పాసుల మీద స్టాంపింగ్ ఇక ఉండదు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో బ్యూరో అఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే బోర్డింగ్ పాసులు మీద స్టాంపింగ్‌ను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అటు ప్రయాణీకులు ఖచ్చితంగా తమతో పాటు హ్యాండ్ శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించారు. అంతేకాక ప్రయాణీకులు ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. మరోవైపు సీసీటీవి కెమెరాలు, ఎయిర్ పోర్టు సిబ్బంది అన్ని […]

బోర్డింగ్ పాసుల మీద స్టాంపింగ్ ఇక ఉండదు..
విమాన ప్రయాణ ఛార్జీల మోత: ఏప్రిల్‌ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్‌ఎఫ్‌) పెరగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.ఇక ఏప్రిల్ నుంచి మీ విమాన ప్రయాణాన్ని మరింత ఖరీదైనదిగా మారిపోయింది. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది.
Follow us

|

Updated on: May 14, 2020 | 3:40 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో బ్యూరో అఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే బోర్డింగ్ పాసులు మీద స్టాంపింగ్‌ను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అటు ప్రయాణీకులు ఖచ్చితంగా తమతో పాటు హ్యాండ్ శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించారు. అంతేకాక ప్రయాణీకులు ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

మరోవైపు సీసీటీవి కెమెరాలు, ఎయిర్ పోర్టు సిబ్బంది అన్ని వేళలా తనిఖీలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రయాణం చేసే ప్రయాణీకుల వివరాలను డిజిటల్‌గా రికార్డు చేస్తామన్నారు. కాగా, ఈ నెల 17 లేదా 18 వ తేది నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం ఉందని సమాచారం.

Read This: నల్లకోట్లు గాయబ్.. జడ్జీలు, లాయర్ల డ్రెస్ కోడ్ మార్చేసిన కరోనా..