AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ ఎత్తి వేశాక… విమాన చార్జీలకు రెక్కలు ?

దేశంలో లాక్ డౌన్ ఎత్తివేశాక విమాన చార్జీల పెంపు అనివార్యమంటున్నారు ఎయిరిండియా మాజీ చీఫ్ జితేంద్ర భార్గవ. ఓ ఛానల్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన..  ఈ చార్జీలు ఇదివరకు ఉన్నట్టు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉన్నట్టు ఉండబోవని జోస్యం చెప్పారు. ‘ది డేస్ ఆఫ్ చీప్ ట్రావెల్ ఆర్ ఓవర్’ అని వ్యాఖ్యానించారు. మన దేశంలోని ప్రైవేటు విమానాల ‘అత్యుత్సాహం’ తనకు అర్థం కావడం లేదని, లాక్ డౌన్ […]

లాక్ డౌన్ ఎత్తి వేశాక... విమాన చార్జీలకు రెక్కలు ?
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: May 14, 2020 | 3:54 PM

Share

దేశంలో లాక్ డౌన్ ఎత్తివేశాక విమాన చార్జీల పెంపు అనివార్యమంటున్నారు ఎయిరిండియా మాజీ చీఫ్ జితేంద్ర భార్గవ. ఓ ఛానల్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన..  ఈ చార్జీలు ఇదివరకు ఉన్నట్టు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉన్నట్టు ఉండబోవని జోస్యం చెప్పారు. ‘ది డేస్ ఆఫ్ చీప్ ట్రావెల్ ఆర్ ఓవర్’ అని వ్యాఖ్యానించారు. మన దేశంలోని ప్రైవేటు విమానాల ‘అత్యుత్సాహం’ తనకు అర్థం కావడం లేదని, లాక్ డౌన్ లిఫ్ట్ చేసిన అనంతరం నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించవలసిందేనని అన్నారు. ఫ్లయిట్స్ లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలని నిర్దేశించారని, అలాగే చివరలో మూడు వరసలు కూడా ఖాళీగా ఉంటాయన్నారు. అంటే బహుశా కరోనా అనుమానితులను ఆ వరసల్లోకి తరలించే సూచనలు ఉన్నాయన్నారు. ప్రయాణికులకు గ్లోవ్స్, మాస్కులు ఇస్తామని ఎయిర్ లైన్స్ వారు చెబుతున్నారు. అయితే నిర్లక్ష్యంగా ఉన్న ప్రయాణికుడెవరైనా దురుసుగా ప్రవర్తిస్తే మిగతా ప్రయాణికుల సంగతి ఏమిటని జితేంద్ర భార్గవ ప్రశ్నించారు.

విమానాశ్రయాల్లో అన్ని చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికులను టెస్ట్ చేయడం మంచిదేనని, కానీ ఒక ప్రయాణికుడెవరైనా తనకు కరోనా లక్షణాలు లేవని భావించినప్పుడు టెస్ట్ సందర్భంలో తీవ్ర ఉద్వేగానికి గురి కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదేనన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా అని పేర్కొన్నారు. 9/11 సంఘటనను ఆయన గుర్తు చేస్తూ.. ఎయిర్ లైన్స్ కొత్త ఇన్నోవేషన్స్ తో వఛ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం పరిపాటే అని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాలు బయటి దేశాల విమానాలను అనుమతించడం లేదన్న విషయాన్ని జితేంద్ర భార్గవ గుర్తు చేశారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చెందుకు ప్రభుత్వం 20 లక్షల కోట్లతో భారీ ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేస్తూ.. ఏది ఏమైనా ఎయిర్ లైన్స్ ని బెయిల్ ఔట్ చేయడమన్నది సాధ్యం కాదని అన్నారు. కావాలంటే ఎయిర్ లైన్ పన్ను చెల్లింపు గడువును  వాయిదా వేయవచ్చు అని జితేంద్ర భార్గవ పేర్కొన్నారు.