విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక సొంత కాలేజీల్లోనే పరీక్షలు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో పరీక్షల విధానంలో జేఎన్‌టీయూ హైదరాబాద్ కీలక మార్పులు

  • Tv9 Telugu
  • Publish Date - 4:05 pm, Thu, 14 May 20
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక సొంత కాలేజీల్లోనే పరీక్షలు..

JNTU Hyderabad: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో పరీక్షల విధానంలో జేఎన్‌టీయూ హైదరాబాద్ కీలక మార్పులు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పరీక్షలను సొంత కాలేజీల్లోనే నిర్వహించేలా నిర్ణయించింది. గతంలో ఒక కాలేజీ స్టూడెంట్స్ మరో కాలేజీలో పరీక్షలు రాసే విధానం ఉండేది. కరోనావైరస్ దెబ్బకు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మినహాయించింది.

కాగా.. పరీక్ష సమయాన్ని కూడా 3 గంటల నుంచి రెండు గంటలకు కుదించింది. ముందుగా ఫైనల్ ఇయర్ వాళ్లకు జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మిగతా వారికి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, జూలై మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశాలున్నాయి.

Also Read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!