Covid ayurveda medicine : ‘ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడొద్దు..’ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి

Anandayya Corona ayurveda medicine ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విన్నవించారు..

Covid ayurveda medicine : 'ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడొద్దు..' రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి
Follow us
Venkata Narayana

|

Updated on: May 20, 2021 | 5:39 PM

Anandayya Corona ayurveda medicine ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విన్నవించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కొవిడ్ నయమవుతోందని ఆయన అన్నారు. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తోందన్న సోమిరెడ్డి.. గతంలో ఆయన తల్లి గారు కూడా మందులు ఇచ్చే వారు.. ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో ఆనందయ్య సేవలందిస్తున్నారని ఆయన చెప్పారు. “కొవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటివరకు 70 వేల మందికి ఇచ్చారు..ఏ ఒక్కరి నుంచి ఇబ్బందులు రాలేదు.. ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీని అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు.. హైదరాబాద్ లో చేప మందు ఇస్తున్నారు. నెల్లూరు మూలాపేటలో రోజూ దండ వేస్తారు..మా అల్లీపురం మేకలవారితోటలో వేపాకు మండ వేస్తారు.. ఎవరి నమ్మకం వారిది అంటూ సోమిరెడ్డి తెలిపారు. ” ఈ రోజు రెమిడెసివర్ వంటి ఎన్నో మందులు వాడినా, ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలు ధారపోసినా ప్రాణాలు పోతున్నాయి.. ఐసీయూలోకి పోతే ఎంత మంది బయటకు వస్తారో తెలియని పరిస్థితి.. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు తయారీలో ఉపయోగిస్తున్నవి తిప్పతీగ, తాటిబెల్లం, పట్ట, తేనె, లవంగాలు, వేపాకు, మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, బుడబుడసాకు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, జాజికాయ తదితరాలు.. వీటిలో హానికరమైనవి ఏమైనా ఉన్నాయా..” అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

ఒక్క రూపాయి తీసుకోకుండా ఇస్తున్న మందుతో నష్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించిన ఆయన, ” WHO, IMA, ICMR తదితర సంస్థలు రోజుకొక కరోనా మార్గదర్శకాలు ఇస్తున్నాయి.. కొవిడ్ నుంచి కోలుకున్నాక 6 నెలల తర్వాత వ్యాక్సీన్ వేయించుకోవాలంటారు.. ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ మొదట నెల అన్నారు.. ఇప్పుడు ఆరు నెలలంటున్నారు.. మొదట ప్లాస్మా తెరఫి అన్నారు.. ఇప్పుడు వద్దంటున్నారు.. ప్రతిష్టాత్మక వైద్యసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దేనిపైనా క్లారిటీ లేదు.. ఆక్సిజన్ సప్లయి చేయలేరు..బెడ్లు ఇవ్వలేరు..ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య ఉచితంగా ఇచ్చే మందు పంపిణీకి మద్దతు తెలపండి..” అంటూ జగన్ సర్కారుని సోమిరెడ్డి కోరారు. ఆనందయ్యకు గ్రామస్తులు కూడా అండగా నిలిచి.. మందు తయారీ, పంపిణీలో 30 మంది యువకుల వరకు సహాయంగా నిలుస్తున్నారని ఇది ఒక సంచలనాత్మకమైన మందని.. నెల్లూరులో రోజుకు 50 నుంచి 100 మంది చనిపోతున్న పరిస్థితుల్లో కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు రూపంలో ఒక ఆసరా దొరికిందని సోమిరెడ్డి చెప్పారు. వేలాది మంది ఒకేసారి రావడంతో ఇబ్బందులేమైనా ఉంటే పోలీసులను పెట్టి డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోండి.. వెంటనే మందు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. అంటూ సోమిరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.

Read also : Corona Ayurveda medicine : ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి