అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట
ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకే ప్రమాదముందని.. చైనా శాస్త్రవేత్తలు తాజాగా సంచలన పరిశోధన చేశారు. 'గ్రూప్ ఎ' రక్తం ఎవరికైతే ఉంటుందో.. వారికి కరోనా ఎక్కువగా సోకే అవకాశాలున్నట్లు వైద్యులు..
ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకే ప్రమాదముందని.. చైనా శాస్త్రవేత్తలు తాజాగా సంచలన పరిశోధన చేశారు. ‘గ్రూప్ ఎ’ రక్తం ఎవరికైతే ఉంటుందో.. వారికి కరోనా ఎక్కువగా సోకే అవకాశాలున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్‌కు కేంద్రమైన వూహాన్‌లో ఈ అధ్యయనం సాగింది. ‘గ్రూప్ ఎ’ రక్తం ఉన్నవారు కరోనా వైరస్‌తో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు.
అయితే ఈ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. కాగా.. ‘ఎ బ్లడ్’ గ్రూపు ఉన్నవారే కాకుండా ‘ఒ గ్రూపు’ రక్తం ఉన్నవారు కూడా 25 శాతం వరకూ మరణించే అవకాశాలున్నాయని పరిశోధనలో వెల్లడైంది. వూహాన్‌లోని జనాభాలో 32 శాతం మంది ‘టైప్ ఎ’ రక్తం ఉన్నవారే. అయితే.. రక్తం టైప్‌ను బట్టి ఎందుకు సోకుందో చెప్పలేకపోతున్నారు పరిశోధికులు. కాగా.. చైనాలోని వూహాన్‌లో 2173 మందికి కరోనా సోకగా.. వారిలో 206 మంది చనిపోయారట. అందులో ‘ఎ బ్లడ్’ గ్రూపు ఉన్నవారు 85 మందికి ఉండగా, ‘ఒ బ్లడ్’ గ్రూపు ఉన్నవారు 52 మంది ఉన్నారని స్టడీలో పేర్కొన్నారు వైద్యులు. కాబట్టి.. ఎ బ్లడ్ గ్రూపు ఉన్నవారు కాస్త జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. 8 వేల మందికి పైగా మరణించారు. అయితే ఇప్పుడు ఇండియాలోనూ.. 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ.. 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు వెలవడ్డాయి.
Read More this also: కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్
సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..
నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు
హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..