సింగ‌రేణి కార్మికుడికి క‌రోనా పాజిటివ్..గ‌నిలో క‌ల‌వ‌రం

సింగ‌రేణి కార్మికుడికి క‌రోనా పాజిటివ్..గ‌నిలో క‌ల‌వ‌రం

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. బీమారిలా వ‌చ్చి మ‌హ‌మ్మారిగా ప్ర‌తాపం చూపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకూ విస్త‌రిస్తోన్న కోవిడ్ భూతం..ఇప్పుడు సింగ‌రేణిలోనూ క‌ల్లోలం రేపుతోంది. సింగరేణిలో పని చేసే ఓ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గ‌ని కార్మికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. భూపాల‌ప‌ల్లి నుంచి సింగ‌రేణిలో ప‌నిచేసే ఓ కార్మికుడు ఇటీవల మర్కజ్ వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డి ద్వారా త‌న కుమార్తెకు క‌రోనా సోకింది. దీంతో ఇద్ద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స […]

Jyothi Gadda

|

Apr 10, 2020 | 7:31 AM

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. బీమారిలా వ‌చ్చి మ‌హ‌మ్మారిగా ప్ర‌తాపం చూపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకూ విస్త‌రిస్తోన్న కోవిడ్ భూతం..ఇప్పుడు సింగ‌రేణిలోనూ క‌ల్లోలం రేపుతోంది. సింగరేణిలో పని చేసే ఓ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గ‌ని కార్మికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

భూపాల‌ప‌ల్లి నుంచి సింగ‌రేణిలో ప‌నిచేసే ఓ కార్మికుడు ఇటీవల మర్కజ్ వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డి ద్వారా త‌న కుమార్తెకు క‌రోనా సోకింది. దీంతో ఇద్ద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. అయితే, వైర‌స్ బాధితుడు ఢిల్లీ ప్రార్థ‌న‌ల నుంచి వ‌చ్చిన త‌ర్వాత కూడా విధుల‌కు హాజ‌రైన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో అత‌డితో క‌లిసి ప‌నిచేసిన కార్మికులంద‌రినీ అధికారులు క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

సింగరేణిలో పని చేసే కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సంస్థ అప్రమత్తమైంది. అతడితో ఎవరెవరు కలిసి పని చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దనే ఉద్దేశంతో బొగ్గు తవ్వకాలను మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ ఏప్రిల్ 1 నుంచి భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకాలను నిషేధించారు. ఓపెన్ కాస్ట్ గనులు మాత్రం యధావిధిగా పని చేస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu