మార్కెట్లపై మారిటోరియం ఎఫెక్ట్

దేశీయ స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ ఆర్ధిక ఏడాదిలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకశాలు ఉండటంతో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారిటోరియంను మరో మూడు నెలలపాటు పొడిగించటంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం కొద్దిపాటి లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి […]

మార్కెట్లపై మారిటోరియం ఎఫెక్ట్
Follow us

|

Updated on: May 22, 2020 | 5:43 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ ఆర్ధిక ఏడాదిలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకశాలు ఉండటంతో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారిటోరియంను మరో మూడు నెలలపాటు పొడిగించటంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఈ ఉదయం కొద్దిపాటి లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి పడిపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 30,672కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,039 వద్ద స్థిరపడింది.