కొంపముంచిన కోయంబేడు.. తమిళనాడులో 14 వేలు దాటిన కరోనా కేసులు..
తమిళనాడులో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కోయంబేడు లింకులతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు 786 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 14, 753కు చేరింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడి తమిళనాడులో 98 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక చెన్నై విషయానికి వస్తే.. సిటీలో ఇవాళ కొత్తగా 567 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా […]

తమిళనాడులో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కోయంబేడు లింకులతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు 786 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 14, 753కు చేరింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడి తమిళనాడులో 98 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక చెన్నై విషయానికి వస్తే.. సిటీలో ఇవాళ కొత్తగా 567 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 9,364కి చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,18,447 పాజిటివ్ కేసులు నమోదు కాగా…48533 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 66330 యాక్టివ్ కేసులు ఉండగా.. వైరస్ కారణంగా 3583 మంది మృతి చెందారు.
Read More:
కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..




