కరోనాను జయించిన ఎన్నారై దంప‌తులు…ఏం చేశారంటే..?

ఈ డాక్ట‌ర్ దంప‌త‌లిద్ద‌రికీ క‌రోనా సోకింది. అయిన‌ప్ప‌టికీ వారు దాన్ని ఎంతో ధైర్యంగా ఎదురుకున్నారు. ఆత్మ‌విశ్వాసంతో సెల్ఫ్ ఐసోలేష‌న్‌తోనే చికిత్స తీసుకుంటూ వైర‌స్ నుంచి త‌ప్పించుకోగ‌లిగారు.

కరోనాను జయించిన ఎన్నారై దంప‌తులు...ఏం చేశారంటే..?
Jyothi Gadda

|

Apr 20, 2020 | 7:26 AM

క‌రోనా అంటేనే జ‌నాలు జంకుతున్నారు. అదేదో ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి మింగేస్తుంద‌న్నంత భ‌యంతో వ‌ణికిపోతున్నారు. మ‌న దేశంలో అయితే, ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి, ఐసోలేషన్ వార్డులో ఉంచేయాలనే అభిప్రాయం ఉంది. ఐతే… కరోనా పాజిటివ్ అయిన ప్రతీ ఒక్కర్నీ అలా తీసుకెళ్లాల్సిన పనిలేదంటున్నారు లండన్‌లో నివసిస్తున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు. ఈ డాక్ట‌ర్ దంప‌త‌లిద్ద‌రికీ క‌రోనా సోకింది. అయిన‌ప్ప‌టికీ వారు దాన్ని ఎంతో ధైర్యంగా ఎదురుకున్నారు. ఆత్మ‌విశ్వాసంతో సెల్ఫ్ ఐసోలేష‌న్‌తోనే చికిత్స తీసుకుంటూ వైర‌స్ నుంచి త‌ప్పించుకోగ‌లిగారు.

తెలంగాణ‌లోని నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాణంపల్లికి గ్రామానికి చెందిన డాక్టర్‌ నిమ్మగడ్డ శేషగిరిరావు. 25 ఏళ్ల‌ క్రితం లండన్ వెళ్లారు. అక్క‌డే సైకాల‌జీ పూర్తి చేసి ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. కుటుంబంతో న్యూబరీ నగరంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్ద‌రు క‌వ‌ల‌లు.  6 వారాల కిందట ఆయన భార్య హేమకు కరోనా పాజిటివ్ వచ్చింది. లండన్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచించారు. ఐతే… ఆమెకు డయాబెటిస్‌తోపాటూ… హైపర్ టెన్షన్ కూడా ఉండటంతో… ఆమెను ప్రత్యేక గదిలో ఉంచిన డాక్టర్ శేషగిరిరావు… తమ కవల పిల్లల్ని… వేరే గదిలో ఉంచారు. భార్యకు సేవలు చేస్తుండగా… ఆయనకు కూడా కరోనా సోకింది. ఇలా దంపతులు ఇద్దరూ కరోనా బారిన పడి… ఇంట్లోనే ట్రీట్‌మెంట్ పొందాల్సి వచ్చింది.

అప్పటికే బ్రిటన్‌లో వేల మందికి వైరస్‌ సోకడంతో ఆస్ప‌త్రుల‌న్ని కిక్కిరిసిపోయాయి. బయట చికిత్స తీసుకొనే పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాంతో తన ఇంట్లోనే వైద్యం తీసుకొనేందుకు వారు సిద్ధమయ్యారు. ఒకవైపు భార్య హేమకు చికిత్స అందిస్తూనే, మరోవైపు తనకు తాను చికిత్స చేసుకొన్నారు. 14 రోజులపాటు ఇల్లు దాటి బయట అడుగు కూడా పెట్టకుండా సెల్ఫ్‌ ఐసొలేషన్‌ పాటించారు. ఇంట్లోని పల్స్‌ ఆక్సిమీటర్‌తో రక్తంలో ఆక్సిజన్‌ శాతం తెలుసుకొంటూ జాగ్రత్తలు తీసుకొన్నారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు నిత్యం పసుపు, అల్లం, ఉప్పు, మిరియాలు వంటి వాటితో గృహవైద్యాన్ని పాటించారు.. ఆందోళనను బయటకు కనిపించకుండా ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ ఐసోలేష‌న్  పూర్తిచేసి తిరిగి ఆరోగ్యవంతులయ్యారు.ఈ విష‌యాన్నిడాక్టర్‌ శేషగిరిరావు బంధువులు వెల్ల‌డించారు. క‌రోనా భ‌యంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్న త‌రుణంలో శేషగిరిరావు దంపతులు ఇంట్లోనే ఉంటూ… కరోనాను జయించడం అందరికీ ప్రేరణే అంటూ ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu