AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ప్రభావం.. పిల్లల్లో అరుదైన సమస్య

కరోనా సోకిన కొందరు పిల్లల్లో పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌(పీఐఎంఎస్‌-టీఎస్‌) అనే అరుదైన సమస్య వస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు

కరోనా ప్రభావం.. పిల్లల్లో అరుదైన సమస్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2020 | 11:07 AM

Share

Covid 19 effect on children: కరోనా సోకిన కొందరు పిల్లల్లో పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌(పీఐఎంఎస్‌-టీఎస్‌) అనే అరుదైన సమస్య వస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా సోకిన పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ ఎలా మారుతుంది..? అన్న విషయంపై వీరు పరిశోధనలు చేశారు. ఈ మేరకు నేచర్ జర్నల్‌లో పలు వివరాలను ప్రచురించారు.

కరోనా సోకిన పిల్లల రక్తనాళాల్లో వాపు పెరిగిపోయి గుండె పనితీరుపై పడుతోందని వారు వివరించారు. 25 మంది కరోనా పాజిటివ్ రక్త నమూనాలను వారు పరిశీలించగా.. వారిలో కోవిడ్‌ లక్షణాలతో పాటు పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరితో పాటు కరోనా సోకిన తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్న పిల్లల నమూనాలను, ఆరోగ్యంగా ఉన్న మరో ఏడుగులు పిల్లల ఫలితాలతో పోల్చి చూపారు. పీఐఎంఎస్‌-టీఎస్ లక్షణాలున్న పిల్లల్లో సైకోటైన్లు పెరిగిపోయి వ్యాధి నిరోధక వ్యవస్థకు కీలకమైన లింఫోసైట్లు(తెల్ల రక్తకణాలు) తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే వారి రోగనిరోధక వ్యవస్థలో జరిగే మార్పులు సైతం సంక్లిష్టంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడే కవసాకి వ్యాధి తరహ లక్షణాలు కరోనా సోకిన పిల్లల్లో ఉన్నట్లు కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత.. వారి రోగ నిరోధక వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read More:

కరోనా వారియర్స్ పట్ల మానుషి దాతృత్వం

హైదరాబాద్‌ డ్రగ్స్ మాఫియా.. వెలుగులోకి కొత్త విషయాలు

Follow Us
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..