AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: నోటిని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..

How To Control Corona: కరోనా మహమ్మారి మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు శానిటైజింగ్‌ చేసుకోవడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, మాస్కులను ధరించడం...

Corona: నోటిని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టొచ్చు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 4:22 PM

Share

How To Control Corona: కరోనా మహమ్మారి మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు శానిటైజింగ్‌ చేసుకోవడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, మాస్కులను ధరించడం ఇవన్నీ తెలిసినవే. ఇక వైరస్‌ శరీరంలోకి ముఖ్యంగా ముక్కు, కళ్లు, నోరు ద్వారా ప్రవేశిస్తుంది. అయితే అన్నింటితో పోలిస్తే నోటి ద్వారా కరోనా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ అని తాజా అధ్యయనాల్లో తేలింది. నోటి ద్వారా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు 70 శాతానికిపైగా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనాను అడ్డుకట్టవేయడానికి నోటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, దీని ద్వారా కరోనా తీవ్ర దశకు చేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ఓరల్‌ సైన్స్‌ విభాగం పలు అధ్యయనాలు నిర్వహించింది. వీరి పరిశోధనల్లో తేలిన అంశాల ప్రకారం నోరు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వైరస్‌ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. సహజంగానే మానవుని నోటిలో వేల సంఖ్యలో బ్యాక్టీరియాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ కారణంగా దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కొంత కాలానికి చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దీంతో చిగుళ్లలో వాపు వచ్చి దంతాల చుట్టూ కండరం స్పాంజీ మాదిరిగా మెత్తగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో ఒకవేళ వైరస్‌ నోటిద్వారా ప్రవేశిస్తే అది తొలుత.. దంతాలపై చేరుకుంటుంది. చిగుళ్ల వాపు భాగాల్లో చేరి ఇన్‌ఫెక్షన్‌ పెరగడానికి వైరస్‌ కారణమవుతుంది. ఈ కారణంగా వైరస్‌ వృద్ధి పెరిగే అవకాశాలు ఏర్పడుతాయి. ఇలా వృద్ధి చెందిన వైరస్‌ వెంటనే వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది అని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కారణంగానే దంతాలను రోజూ కనీసం రెండుసార్లు శుభ్రపర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఆహార పదార్థం తిన్న తర్వాత నోటిని శుభ్రంగా ఉంచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో రుచిని కోల్పోవడమే కాకుండా, లాలాజలం ఊరే స్థాయి తగ్గిపోయి తడారిపోతుండడం, అల్సర్లు ఏర్పడడం, నాలుకపై నల్లని మచ్చలు రావడం వంటివి కూడా కరోనా లక్షణాల్లో భాగమని తేల్చిన విషయం తెలిసిందే.

Also Read: Vaccination: కొత్తగా ఆమోదం పొందిన స్పుత్నిక్ వి టీకాను ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న ఐదు కంపెనీలు..పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడే..

First Space Travel: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

మీ వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ ఉందా..! లేకపోతే అంతే సంగతులు.. ఏం జరుగుతుందో తెలుసుకోండి..