AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కారును సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకంటే ?

మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కారును చెన్నై పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ రూల్స్ ని ఉల్లంఘించాడన్న కారణంపై వారీ చర్య తీసుకున్నారు. అడయార్ నుంచి ఆయన ఉతాండి వరకు కూరగాయలు కొనేందుకు తన కారులో వచ్చాడట. చెన్నైలో..

మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కారును సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకంటే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 5:09 PM

Share

మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కారును చెన్నై పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ రూల్స్ ని ఉల్లంఘించాడన్న కారణంపై వారీ చర్య తీసుకున్నారు. అడయార్ నుంచి ఆయన ఉతాండి వరకు కూరగాయలు కొనేందుకు తన కారులో వచ్చాడట. చెన్నైలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం.. నిత్యావసరాల కొనుగోలుకు ఎవరైనా తమ ఇంటినుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరం వరకే వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాబిన్ సింగ్ తన ఇంటి నుంచి ఇంతకన్నా ఎక్కువ దూరమే ప్రయాణించి ఉంటాడని భావిస్తున్నారు. అతని వద్ద ఈ-పాస్ గానీ, చెల్లుబాటయ్యే ఇతర పత్రాలు గానీ ఏవీ లేవని పోలీసులు తెలిపారు. ఏమైనా… రాబిన్ సింగ్ తమతో చాలా మర్యాదగా ప్రవర్తించాడని, కారును సీజ్ చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పలేదని వారు అన్నారు.

Follow Us