ఆర్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు

రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు 'లీక్' చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు "మారటోరియం" ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.

ఆర్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు
Follow us

|

Updated on: Jun 04, 2020 | 4:02 PM

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ సందర్భంగా ఉపాధి కోల్పియి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేనివారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) “మారటోరియం”ను తీసుకొచ్చింది. మొదట, మార్చి 1 నుంచి మే 31 మధ్య వాయిదాలు చెల్లించాల్సిన రుణాలపై మొరటోరియం విధించింది. ఆ తర్వాత దీనిని ఆగస్టు చివరి వరకు పొడిగించింది. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ఆర్బీఐ ఇచ్చిన మారటోరియంను పట్టించుకోకుండా… తీసుకున్న రుణాలపై వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనిపై బ్యాంకుల రుణాలపై వడ్డీ వసూలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారించింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ షా నేతృత్వంలోని ధర్మాసనం. అయితే పొడిగించిన రుణ తాత్కాలిక నిషేధ సమయంలో వడ్డీని మాఫీ చేస్తే రుణదాతలు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారని సెంట్రల్ బ్యాంక్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ అంశంపై రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు ‘లీక్’ చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు “మారటోరియం” ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాము కానీ.., దేశ ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ప్రజలు, దేశం క్లిష్ట పరిస్థితులలో ఉంటే బ్యాంకులకు లాభార్జన ధ్యేయంగా మారిందని పిటీషనర్ తరపు న్యాయవాది రాజీవ్ దత్తా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పై కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వు బ్యాంకు వివరణ కోరుతూ తదుపరి విచారణను జూన్ 12 కు వాయిదా వేసింది ధర్మాసనం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..