AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మాట పాటిద్దాం.. పవన్ కల్యాణ్‌ పిలుపు..!

ప్రధాని మాట పాటిద్దాం.. కరోనా విముక్త భారతాన్ని సాదిద్దాం అని పిలుపునిచ్చారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ఇవాళ

ప్రధాని మాట పాటిద్దాం.. పవన్ కల్యాణ్‌ పిలుపు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2020 | 10:07 PM

Share

ప్రధాని మాట పాటిద్దాం.. కరోనా విముక్త భారతాన్ని సాదిద్దాం అని పిలుపునిచ్చారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ఇవాళ రాత్రి 12గంటల నుంచి 21 రోజుల పాటు భారత్ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ.. ప్రజలు నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ఈ లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వేరే దారి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను అనుసరించండి. దయచేసి అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నాను. బయటికి ఎవరు రావద్దు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు, సూచనలు పొందండి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

Read This Story Also: Big Breaking: 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌.. మోదీ కీలక ప్రకటన!