సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏమన్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు.రాష్ట్రంలో కరోనా మహమ్మారి నివారణకు, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకున్న అంశాన్ని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. గత వారం రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల […]

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు.రాష్ట్రంలో కరోనా మహమ్మారి నివారణకు, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకున్న అంశాన్ని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
గత వారం రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఏపీలో 647 కేసులు నమోదయ్యాయి. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాల్టీ ప్రాంతంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.