కుక్కలకూ కరోనా.. ఐసొలేషన్‌లో‌ 14 రోజుల ‘హైరానా’

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సోకుతుందని అనుకుంటూవచ్చాం.

కుక్కలకూ కరోనా.. ఐసొలేషన్‌లో‌  14 రోజుల 'హైరానా'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 05, 2020 | 12:33 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సోకుతుందని అనుకుంటూవచ్చాం. కానీ మనుషుల నుంచి జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుందన్న షాకింగ్ వాస్తవం బయటపడింది. హాంకాంగ్ లో కోవిడ్-19 రోగి అయిన 60 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కకు కూడా ఈ వైరస్ సోకిందట. టెస్టులు జరపగా ఈ జాగిలానికి ‘వీక్ పాజిటివ్’ లక్షణాలున్నట్టు తేలింది. అంటే స్వల్పంగా ఈ వైరస్ బారిన పడిందని తెలిసింది. దీన్ని ఎనిమల్ సెంటర్ లో 14 రోజుల ఐసొలేషన్ కోసం తరలించారు.

ఈ పోమేరియన్ డాగ్ కి తక్కువ స్థాయిలో కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు హాంకాంగ్ వ్యవసాయ, మత్స్య శాఖ అధికారులు తెలిపారు. చూడబోతే ఇది మనుషుల నుంచి జంతువులకు వ్యాపించిన తొలి కేసు అయినట్టు కనిపిస్తోందని వివిధ యూనివర్సిటీలు, జంతువుల ఆరోగ్యానికి సంబంధించిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్టు వారు చెప్పారు. అటు-హాంకాంగ్ ప్రభుత్వం ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ.. కరోనాకు గురైనట్టు అనుమానించిన అన్ని పెంపుడు జంతువులనూ 14 రోజుల పాటు ఐసొలేషన్ లో ఉంచాలని సూచించింది. నగరంలో మరో కరోనా రోగికి చెందిన  శునకానికి కూడా ఈ వైరస్ సోకినట్టు తెలియడంతో ఆ కుక్కను కూడా ఎనిమల్ సెంటర్ లో ఐసొలేషన్ కి తరలించారు. అన్ని టెస్టులు చేశాక కరోనా లేదని తేలాకే ఈ శునకాలను వాటి యజమానులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!