AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ముంబాయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ విధులకు హాజరయ్యేందుకు రెడీ అవుతుండగా, అతడి కొడుకు తన తండ్రి ఇంట్లోనే తనతోపాటే ఉండాలని కోరుకుంటూ ఏడ్వడం చూస్తే గుండె బరువెక్కుతుంది. 'నాన్న ఇంట్లోనే ఉండు.. బయట కరోనా..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 5:37 PM

Share

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకీ చాప కింద నీరులాగా ప్రబలుతూనే ఉంది. ఇంకా ఈ వైరస్‌కి మందు కనుగొనలేకపోవడంతో.. అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సామాజిక సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. లేకుంటే.. భారత దేశం కూడా ఇబ్బందులు ఎదుర్కోడం తప్పదని ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇక పోతే కొంతమంది ఆకతీయులు చేసిన పనుల వల్ల డాక్టర్లకు, పోలీసులకు పని పెరిగిపోతుంది.

రోగాల సంఖ్య పెరగకుండా చూడాలని ప్రభుత్వం చేతెలెత్తి దండం పెడుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. నిజాన్ని గ్రహించకుండా రోడ్ల మీదకు వచ్చి పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల ఆకతాయిలకు చెక్ పెట్టడానికి పోలీసులు రేయింబవళ్లు శ్రమించాల్సి వస్తుంది. కొందరైతే వారి ఇళ్లను కూడా మర్చిపోయి రోడ్లపైనే గడుపుతున్నారు. తమ కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి బయట గడపాల్సి వస్తోంది.

అయితే ముంబాయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ విధులకు హాజరయ్యేందుకు రెడీ అవుతుండగా, అతడి కొడుకు తన తండ్రి ఇంట్లోనే తనతోపాటే ఉండాలని కోరుకుంటూ ఏడ్వడం చూస్తే గుండె బరువెక్కుతుంది. ‘నాన్న ఇంట్లోనే ఉండు.. బయట కరోనా ఉంది.. వెళ్లకంటూ ఏడుస్తున్న ఆ పిల్లాడిని ఎత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా ఊరుకోవడం లేదు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా’ మారింది.

ఇవి కూడా చదవండి: 

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు