సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!
COVID 19: కరోనా వైరస్ మహమ్మరి భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటిస్తే ఇండియాలో కోవిడ్ 19 కేసులను సుమారు 62 శాతం మేరకు తగ్గించేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు ఈ మహమ్మారి ప్రపంచమంతా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రజల్లో […]
COVID 19: కరోనా వైరస్ మహమ్మరి భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటిస్తే ఇండియాలో కోవిడ్ 19 కేసులను సుమారు 62 శాతం మేరకు తగ్గించేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అటు ఈ మహమ్మారి ప్రపంచమంతా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రజల్లో సోషల్ డిస్టెన్సింగ్ గురించి అవగాహన పెంచుతూ వస్తోంది. అంతేకాకుండా డాక్టర్లు సైతం ప్రజలు సామాజిక దూరాన్ని తమ జీవితాలలో ఒక భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క మార్గం అని ఐసీఎంఆర్ చెబుతోంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో ఇండియన్స్ సామాజిక దూరాన్ని, క్వారంటైన్‌ను పాటిస్తే భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 62 శాతం మేరకు తగ్గుతుందని స్పష్టమైంది.
ఈ వైరస్ సంక్రమించకుండా ఉండేందుకు ప్రజలు తమకు తాము ఆంక్షలు విధించుకోవడమే కాకుండా వ్యాధి సోకిన వారికి, అలాంటి లక్షణాలు ఉన్నవారి దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రపంచ మహామ్మరిగా మారడానికి రెండు వారాల ముందు ఈ సంస్థ ఓ అధ్యయనం చేసింది. భారతదేశంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రూపిందించింది.
మరోవైపు విమాన ప్రయాణాల ద్వారా కోవిడ్ 19 ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా 17వ స్థానంలో ఉందని రిపోర్టు సూచించింది. అటు ఇండియాలో ఎక్కువగా అంతర్జాతీయ రాకపోకలు ఉన్న నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలలో కోవిడ్ 19 వ్యాప్తిపై ఐసీఎంఆర్ రీసెర్చర్లు అంచనా వేశారు.
ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారికి 1.5 నుంచి 4.9 మీటర్ల దూరంలో ఉన్న కాంటాక్టులకే ఈ వ్యాధి సోకినట్లు వారి నివేదికలో తేలింది. కాబట్టి ఈ కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని కోరుకుంటున్నారు. కాగా, కరోనా వైరస్ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 694 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 13 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు.
For More News:
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!
కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..