వారి కోసమే లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాంః ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్‌ను మరింత కఠినం చేయాల్సింది పోయి.. శనివారం నుంచి క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ‘దేశంలోని పేదవాళ్లు, రోజూ వారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఇలా […]

వారి కోసమే లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాంః ఇమ్రాన్ ఖాన్
Follow us

|

Updated on: May 08, 2020 | 4:35 PM

పాకిస్తాన్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్‌ను మరింత కఠినం చేయాల్సింది పోయి.. శనివారం నుంచి క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ‘దేశంలోని పేదవాళ్లు, రోజూ వారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఇలా లాక్ డౌన్ ఎత్తివేయడం సరైన నిర్ణయం కాదని తెలుసనీ.. కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తోందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని.. అయినప్పటీకి పేదవారి కోసం ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించామన్నారు. ఇక జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్.. ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలులో ఉంటాయని అన్నారు. షాపులన్నీ వారంలో ఐదు రోజులు పాటు సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటాయన్న ఆయన.. ప్రజా రవాణాకి మాత్రం ప్రస్తుతం అనుమితివ్వట్లేదని స్పష్టం చేశారు. కాగా, పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 25,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 594 మరణాలు సంభవించాయి. పాక్‌లోని సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!