100 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా..త్రిపురలో వైరస్‌ విజృంభణ

భారత్‌లో పంజా విసురుతున్న కరోనా..అన్ని వర్గాల ప్రజలను వెంటాడుతోంది. ప్రజాప్రతినిధుల, రాజకీయ, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఎవరూ అతీతులు కారనంటూ కరోనా కాటు వేస్తోంది. చివరకు వైద్యులు, పోలీసులు, బార్డర్‌లోని సైన్యాన్ని సైతం వైరస్‌ వదలకుండా వేటాడుతోంది.

100 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా..త్రిపురలో వైరస్‌ విజృంభణ
Telangana Coronavirus
Follow us

|

Updated on: Jul 20, 2020 | 8:27 PM

భారత్‌లో పంజా విసురుతున్న కరోనా..అన్ని వర్గాల ప్రజలను వెంటాడుతోంది. ప్రజాప్రతినిధుల, రాజకీయ, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఎవరూ అతీతులు కారనంటూ కరోనా కాటు వేస్తోంది. చివరకు వైద్యులు, పోలీసులు, బార్డర్‌లోని సైన్యాన్ని సైతం వైరస్‌ వదలకుండా వేటాడుతోంది. త్రిపుర రాష్ట్రంలో వందకు పైగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వైరస్‌ బారినపడ్డారు.

త్రిపురలో సోమవారం కొత్తగా 223 కరోనా పాజిటివ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,892కు పెరిగినట్టు ఆ రాష్ట్ర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కోవిడ్‌ కేసుల్లో 101 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నట్లుగా సీఎం స్పష్టం చేశారు.కరోనా బారిన పడిన జవాన్లకు సల్బాగన్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది.

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 1,114 మంది కరోనా యాక్టివ్‌ కేసులుండగా, వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కాగా, 1,759 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందిని ఇతర రాష్ట్రాలకు పంపించినట్లు అధికారులు స్పష్టం చేశారు.