ముంబైలో లక్షకు చేరువలో కరోనా కేసులు…ధారవిలో ఎన్నాంటే..?

దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతూ.. పాత రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్‌ చేస్తున్నాయి. కోవిడ్‌ కోరల్లో చిక్కుకుని మహారాష్ట్ర వణికిపోతోంది.

ముంబైలో లక్షకు చేరువలో కరోనా కేసులు...ధారవిలో ఎన్నాంటే..?
Follow us

|

Updated on: Jul 21, 2020 | 5:00 PM

దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతూ.. పాత రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్‌ చేస్తున్నాయి. కోవిడ్‌ కోరల్లో చిక్కుకుని మహారాష్ట్ర వణికిపోతోంది. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 10వేలను చేరింది. కాగా, ఒక్క ముంబైలోనే కోవిడ్ 19 కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇందులో 23వేల యాక్టివ్‌ కేసులు ఉండగా.. 71 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 5714 మంది వైరస్‌ వల్ల మరణించారు. ఇదిలా ఉంటే, ముంబైలోని ధారవిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ధారవిలో మొత్తం కేసులు 2500లకు చేరుకున్నాయి.

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారవిలో సోమవారం మరో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. వీటితో కలిపి ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,492కి చేరింది. ఈ మేరకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ధారావిలో 147 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం 2,492 కొవిడ్-19 పేషెంట్లలో 2,095 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ మురికివాడలో… ఇప్పుడు కరోనా కేసులు నెమ్మదించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ప్రశంసలు కురిపించింది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..