ఒలింపిక్స్‌ను నిర్వహించకపోవడమే బెటరంటున్న టోక్యో వాసులు

ఒలింపిక్స్‌ను నిర్వహించాలా? వద్దా అన్నదానిపై ఓ సర్వే చేస్తే సగానికి సగం మంది రద్దు చేస్తేనే మంచిదని అన్నారు.

ఒలింపిక్స్‌ను నిర్వహించకపోవడమే బెటరంటున్న టోక్యో వాసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2020 | 3:45 PM

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇలాంటి సమయంలో విశ్వ క్రీడ అయిన ఒలింపిక్స్‌ను నిర్వహించకపోవడమే బెటరంటున్నారు టోక్యో ప్రజలు.. ఇప్పుడే కాదు వచ్చే ఏడాది కూడా తమ దగ్గర మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌ అయిన ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటే కూడదని గట్టిగా చెబుతున్నారు.

ఒలింపిక్స్‌ను నిర్వహించాలా? వద్దా అన్నదానిపై ఓ సర్వే చేస్తే సగానికి సగం మంది రద్దు చేస్తేనే మంచిదని అన్నారు. జపాన్‌కు చెందిన కైడో న్యూస్‌, టోక్యో ఎమ్‌ఎక్స్‌ టెలివిజన్‌ సంయుక్తంగా సింగిల్‌ డేటా పాయింట్‌తో సర్వేను నిర్వహించాయి.. టెలిఫోన్ ద్వారా రెండు రోజుల పాటు జరిపిన ఈ సర్వేలో 51.7 శాతం మంది ఒలింపిక్స్‌ వాయిదా పడటమో లేదా రద్దు కావడమో జరుగుతాయని అనుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా కొన్ని నెలల తర్వాతైనా ఒలింపిక్స్‌ జరుగుతాయని 46.3 శాతం మంది భావిస్తున్నారు.

స్పోర్ట్స్‌ ఈవెంట్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారిలో కూడా పాతికశాతానికి పైగా రద్దు చేయాలని కోరుతున్నారు. 24.0 శాతం మంది మాత్రం రెండోసారి వాయిదా వేయాలని అంటున్నారు. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితులలో ఒలింపిక్స్‌ వంటి పెద్ద క్రీడా టోర్నమెంట్‌ను నిర్వహించడం మంచిది కాదన్నది వైద్య నిపుణుల భావన.. ప్రేక్షకులు లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఓ 30 శాతం మంది వ్యక్తపరిచారు.. మొత్తంగా టోక్యో ప్రజలు మాత్రం ఒలింపిక్స్‌ను కోరుకోవడంలేదని తేలింది..