Viral News: ఈ పెద్దాయ‌న మాస్క్ చూశారా.. ప‌క్షి గూడుతో వ‌చ్చేశాడు… ఎందుకో తెల్సా..?

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య ముఖానికి....

Viral News: ఈ పెద్దాయ‌న  మాస్క్ చూశారా.. ప‌క్షి గూడుతో వ‌చ్చేశాడు... ఎందుకో తెల్సా..?
Viral News

Edited By:

Updated on: Apr 22, 2021 | 10:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విచిత్ర సంఘటన
మాస్క్‌ బదులు గిజిగాడు గూడు వేసుకొచ్చిన మేకల కాపరి
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య ముఖానికి గిజిగాడి గూడును మాస్కులా ధరించి పింఛన్ కోసం వచ్చాడు. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. పశువులను మేపడానికి వెళ్లగా.. పింఛను ఇస్తున్నారని తెలిసి తిరిగి వచ్చానని, మాస్క్ లేకపోతే పింఛను ఇవ్వరని.. మధ్యలో కనిపించిన పిట్టగూడును తీసుకుని మాస్కుగా పెట్టుకున్నాడట. ఇది గమనించిన కొందరు స్థానికులు అతన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

చదువుకోకపోయినా మాస్క్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాడని అందరూ అత‌నిని అభినందించారు. అయితే కుర్మయ్య ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు సైతం భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Also Read: మండుటెండలో విధులు నిర్వహిస్తున్న నిండు గర్భిణి.. లేడీ సింగంను ప్రశంసలతో ముంచెత్తున్న నెటిజన్లు

కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..