లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

వారంతా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు. కోవిడ్‌-19పై యుద్ధం చేస్తున్న సైనికులలో వారిదే కీలకపాత్ర. కానీ ఇవేమీ వారికి పట్టలేదు. యావత్‌ దేశం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సమయంలో మందు, విందు అంటూ సంబరాలు..

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 9:59 AM

వారంతా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు. కోవిడ్‌-19పై యుద్ధం చేస్తున్న సైనికులలో వారిదే కీలకపాత్ర. కానీ ఇవేమీ వారికి పట్టలేదు. యావత్‌ దేశం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సమయంలో మందు, విందు అంటూ సంబరాలు చేసుకున్నారు. చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఖమ్మం జిల్లా మధిరలో స్థానిక తహసీల్దార్‌ , పీహెచ్‌సీ వైద్యుడు, సబ్‌ జైలర్‌, ఈవో ఆర్డీ మద్యాన్ని సేవిస్తూ పట్టుబడ్డారు. అసలే లాక్‌డౌన్‌.. మద్యం షాపులన్నీ మూతపడి ఉన్నాయి. అయినా తమ అధికార బలంతో మందు బాటిళ్లను తెప్పించుకున్నారు. తాహసీల్దార్‌ సైదులు, పీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్‌, సబ్‌ జైలర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఈవోఆర్డీ రాజారావు కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌ చేయడంతో నలుగురు పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?