లాక్‌డౌన్‌పై సస్పెన్స్ వీడింది. ప్రధాని మోదీ.. లాక్‌డౌన్ అమలు, ఆంక్షలపై క్లారిటీ ఇచ్చారు. ఇవాళ్టితో లాక్‌డౌన్ కాలం ముగియనుండడంతో….మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ…మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిపుణులు, రాజకీయ నాయకులు, విశ్లేషకుల ప్రముఖుల సంప్రదింపులతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది. మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు” అని మోదీ పేర్కొన్నారు.
మన రాజ్యాంగంలో ‘వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా’ అన్నదానికి ప్రజలు అర్దం చాటారని ప్రధాని కొనియాడారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి రోజున మన సంఘటిత శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నామన్నారు.